
సిద్ధవటం VRM న్యూస్ ఆగస్టు 0 6
సిద్ధవటం మండలం లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి దేవస్థానము నందు 01-09-2025 నుండి 31-08-2026 వ తేది వరకు కొండ పై తాత్కాలిక షాపును(లడ్డు విక్రయం కొరకు ) పెట్టుకోవడానికి హక్కును పొందటానికి మంగళవారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఉ11 గంటలకు సిద్ధవటంలోని శ్రీ రంగనాధస్వామి ఆలయంలో వేలంపాట నిర్వహించగా సిద్ధవటం గ్రామానికి విజయ భాస్కర్(కర్నా) 1లక్ష 43 వేల రూపాయలకు దక్కించుకున్నారని ఆలయ ఇన్చార్జ్ ఈవో శ్రీధర్ తెలిపారు. వేలంపాటలో పాల్గొను పాట దారుడు ధరావత్తు క్రింద రూ.25,000/-లు డిపాజిట్టు చెల్లించి పాటలో పాల్గొన్నారు. ఈ వేలంపాట కు ముగ్గురు వ్యక్తులు పాల్గొనగా అందులో విజయ భాస్కర్ హెచ్చు పాటదారునిగా నిలిచి 1,43,000 రూపాయలకు వేలం దక్కించుకున్నారు.కార్యక్రమంలో దేవాదాయ శాఖ రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్దన్,ఆలయ సిబ్బంది చంద్ర పాల్గొన్నారు.