రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా ప్రజా రవాణా సంస్థ పేరుతో కమిష నర్ ఇచ్చిన సర్కులర్లో 6వ అంశం లో ఘాట్ రోడ్ లో ప్రయాణించే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని విడుదల చేసిన సర్క్యులర్ సవరిం చాలని సిపిఎం కడప నగర కార్య దర్శి రామమో హన్ డిమాండ్ చేశారు. శుక్రవారం కడప లోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.