
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మండల పరిధిలోని తోపుడు బండి అధినేత, పేద విద్యార్థులకు తాత, నిత్యం ప్రజా సేవకుడు, సహాయ సహకారాలలో ముందుండే మహోన్నతమైన వ్యక్తి, పేద విద్యార్థులకు, కంప్యూటర్ లు ల్యాబ్ టాప్ లు, సైకిళ్ళు, పుస్తకాలు, హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు దోమలతెరలు, స్పోర్ట్స్ విద్యార్థులకు యూనిఫామ్ లు ఎన్నో ఉచిత పంపిణీ కార్యక్రమాలు నిర్వహించిన,తోపుడు బండి అధినేత సాదిక్ ఆలీ మొదటి వార్షికోత్సవం తన స్వగృహంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తోపుడు బండి సాదిక్ ఆలి అనే పుస్తక ఆవిష్కరణను,కపిల రాముకుమార్, కవి హైదరాబాదు వాస్తవాలు ఆవిష్కరించడం జరిగింది, తదుపరి డిటెక్టివ్ నవల రచయిత మధుబాబు, కవి యాకూబ్, బెల్లంకొండ ప్రసన్, అగ్రికల్చర్ అధికారి విజయ్,సాదిక్ ఆలీ ధర్మపత్ని ఉష సాదిక్ ఆలీ, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, భాగం ప్రభాకర్ చౌదరి, తక్కెళ్ళ పాటి దుర్గాప్రసాద్, మూకర విజయరావు, భూక్య శివకుమార్ నాయక్, దయ్యాల కిషోర్ దత్, ఉపాధ్యాయ బృందం వ్యాయామ ఉపాధ్యాయులు పసుపులేటి వీరరాఘవయ్య, పాల్గొని సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సహాయం పొందిన వివిధ గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొని సాదిక్ ఆలీ చిత్రపటమునకు శ్రద్ధాంజలి ఘటించి పూలాభిషేకం నిర్వహించారు