Home ఆంధ్రప్రదేశ్ *న్యాయం చేయండి మహాప్రభో అంటూ ఆవేదన వ్యక్తం చేసిన…. వివోఏ మద్దిల అనసూయ దేవి *

*న్యాయం చేయండి మహాప్రభో అంటూ ఆవేదన వ్యక్తం చేసిన…. వివోఏ మద్దిల అనసూయ దేవి *

by VRM Media
0 comments

ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 4:–

ప్రత్తిపాడు గ్రామానికి చెందిన మద్దిల అనసూయదేవి గత 20 సంవత్సరాలుగా పెద్దశంకర్లపూడి గ్రామంలో వివోఏ గా పని చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్దిల అనసూయదేవి ని విధుల నుంచి తొలగించడం జరిగింది.ఈ సందర్భంగా మద్దిల అనసూయదేవి మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పెద్దశంకర్లపూడి గ్రామంలో డ్వాక్రా వివోగా సేవలందిస్తూ సుమారు 30 గ్రూపులను ఏర్పాటు చేసి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న నన్ను తొలగించారు.నన్ను తొలగించడం ఏమిటని గ్రామ టిడిపి నాయకులను ఆశ్రయించగా నువ్వు ఇక్కడ విధులు నిర్వహించడానికి అస్సలు వీలు లేదంటూ చెప్పడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేను వరుపుల సత్యప్రభను ఆశ్రయించగా ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని పెద్ద శంకర్లపూడి గ్రామ నాయకులను కలవమని ఆమె జవాబు ఇచ్చారు. గ్రామ నాయకుల కాళ్లు వేళ్ళు పట్టుకున్న కనీసం కనుకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.భర్త లేని నన్ను ఇంతలా మానసికంగా ఆందోళనకు గురి చేసి హింసించడం ఏమిటని దళిత కులానికి చెందిన మహిళను కాబట్టి ఇలా నన్ను విధుల నుంచి తొలగించడం ఏమిటని ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా గ్రామ నాయకులు,ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి వివోఏ గా విధులు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు.

2,836 Views

You may also like

Leave a Comment