
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణనవంబర్7
అప్పుల బాధతో మన స్థాపనతో కౌలు రైతు పురుగుల మందు త్రాగి మృతి చెందడంతో కుటుంబీకులు రోదిస్తున్న ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి పోలీస్ పటాలయం వెనుక భాగమున శుక్రవారం ఉదయం కౌలు రైతు నరసారెడ్డి (50) పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు చుట్టుపక్కల ఉన్న రైతులు మృతుని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా వారి కుటుంబీకులకు తెలపడంతో సమాచారం తెలుసుకున్న మృతుని భార్య కుమారి ఘటనా స్థలానికి చేరుకొని బోరుమని విలపించడంతో పలువురు దిగ్వాంతి వ్యక్తం చేశారు మృతిని భార్య చెప్పిన కథనం ప్రకారం మాధవరం గ్రామం రోడ్ నెంబర్ 8లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగుతున్నామని నా భర్త గురువారం సొంత పని మీద కడపకు వెళ్లాడని మధ్యాహ్నం భోజనం కు ఇంటికి రమ్మని ఫోన్ చేశానని కడపలో పని ఉంది నేను రాలేను అని చెప్పాడని రెడ్డిపల్లి, లింగాలకుంట, సీతారామపురం, గ్రామాలలోకౌలు రైతు కింద కొన్ని పొలాలు తీసుకొని పంటలు సాగు చేసేవాడని పంటలపై అప్పులు రావడంతో నా భర్త కొన్ని రోజులుగా మనస్థాపన చిందేవాడని దాదాపు 40 లక్షల పైబడి అప్పులు ఉన్నాయని అప్పులు బాధ తట్టుకోలేక పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు ఆమె తెలిపారు
ఈ విషయమై మండల ఎస్సై మహమ్మద్ రఫీ వివరణకోరగా మృతుని భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ తరలింపు చేశామని తెలిపారు