Home ఆంధ్రప్రదేశ్ చేతుల శుభ్రత క్యాన్సర్ పై అవగాహన కీటక జనత వ్యాధులు గుర్తించి

చేతుల శుభ్రత క్యాన్సర్ పై అవగాహన కీటక జనత వ్యాధులు గుర్తించి

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 7

సిద్ధవటం మండలం పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సిద్ధవటం గ్రామంలోని శివ సాయి ఉన్నత పాఠశాల యందు డాక్టర్ రంగలక్ష్మీ ఆదేశాల మేరకు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు కీటక జనిత వ్యాధుల గురించి మరియు చేతుల శుభ్రత క్యాన్సర్ పై అవగాహన మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది దోమలు కుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు కలుషిత ఆహారము కలుషిత నీరు తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి పిల్లలకు అక్కడి ఉపాధ్యాయులకు వివరించడం జరిగినది పిల్లలకు ఆహారానికి ముందు మలవిసర్జన తర్వాత చేతుల శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని దోమల కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చునని చెప్పడం జరిగినది నీరు కాచి చల్లార్చి త్రాగడం వలన వాంతులు విరేచనాలు కామెర్లు లాంటి జబ్బులనుంచి రక్షణ పొందవచ్చునని అక్కడి పిల్లలకు ఉపాధ్యాయులకు చెప్పడం జరిగినది పాఠశాల చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిల్లలకు ఆహారానికి ముందు మలవిసర్జన తరవాత చేతులు శుభ్రంగా ఉండేటట్లు ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పాలని అక్కడి ఉపాధ్యాయులకు సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారు ఉపాధ్యాయులకు పిల్లలకు వివరించడం జరిగినది ఇందులో భాగంగా పిల్లలకు ఉపాధ్యాయులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించడం మరియు ప్లాస్టిక్ వాడకం వల్ల మరియు జంక్ ఫుడ్ లాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బీడీ సిగరెట్ పొగాకు మత్తు పదార్థాలు లాంటివి యువత వాడటం వల్ల నోటి క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందని కనుక విద్యార్థి విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించి మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని యువత మంచి భవిష్యత్తులోకి వెళ్లాలని ఈ సందర్భంగా పిల్లలకు ఆరోగ్య సలహాలు ఇవ్వడం జరిగినది తద్వారా పిల్లలచే మానవహారం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ లక్ష్మీదేవి మౌలాలి హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య ఏఎన్ఎం అంజనమ్మ ఆశ పద్మావతి ఓబులమ్మ కరస్పాండెంట్ రేవతి వెంకటసుబ్బయ్య రాజేష్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగినది

2,831 Views

You may also like

Leave a Comment