Home ట్రెండింగ్ ఇండియాకి డీఎంకే షాక్..! చీలిక తప్పదా ? | ఇండియా బ్లాక్‌లో చీలికలు: టీఎన్ ఎన్నికలపై కాంగ్రెస్ పతనం తర్వాత డీఎంకే కూటమి సమావేశానికి దూరంగా ఉంది. – VRM MEDIA

ఇండియాకి డీఎంకే షాక్..! చీలిక తప్పదా ? | ఇండియా బ్లాక్‌లో చీలికలు: టీఎన్ ఎన్నికలపై కాంగ్రెస్ పతనం తర్వాత డీఎంకే కూటమి సమావేశానికి దూరంగా ఉంది. – VRM MEDIA

by VRM Media
0 comments
ఇండియాకి డీఎంకే షాక్..! చీలిక తప్పదా ? | ఇండియా బ్లాక్‌లో చీలికలు: టీఎన్ ఎన్నికలపై కాంగ్రెస్ పతనం తర్వాత డీఎంకే కూటమి సమావేశానికి దూరంగా ఉంది.


భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇండియా కూటమి (ఇండియా బ్లాక్)లో చీలికకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసి, ఫలితాలు వచ్చాక విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ విషయంలో డీఎంకే (డీఎంకే) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జూన్ 8న జరగాల్సిన ఇండియా కూటమి భేటీకి గైర్హాజరు కావాలని డీఎంకే నిర్ణయం తీసుకుంది.

డీఎంకేకు చిరకాల మిత్రపక్షంగా, కాంగ్రెస్ విజయ్ టీవీకేతో పొత్తు పెట్టుకుంది. ఈ చర్యతో డీఎంకే నేతలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిపైనా భగ్గుమంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పై ద్రోహం, వెన్నుపోటు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇందుతో పాటు లోక్ సభలోనూ కాంగ్రెస్ ఎంపీల పక్కనే వారికి వేరేగా సీట్లు కేటాయించాలని స్పీకర్ కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ రాశారు.

టిఎన్ ఎన్నికలపై కాంగ్రెస్ పతనం తర్వాత డిఎంకె ఇండియా బ్లాక్‌లో పగుళ్లు అలయన్స్ మీట్‌కు దూరంగా ఉన్నాయి

తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, దాని తర్వాత బెంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇండియా కూటమి భేటీ నిర్వహించాలని మమతా బెనర్జీ పట్టుబడుతున్నారు. దీంతో ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో ఈ నెల 8న భేటీ కావాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఇండియా కూటమిలో మూడో అత్యధిక ఎంపీలున్న పార్టీ డీఎంకే డుమ్మా కొట్టడంతో దీని ప్రభావంపైనా ఈ భేటీలో చర్చ జరగబోతోంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి. మరోవైపు కాంగ్రెస్, ఇండియా కూటమికి దూరమవుతున్న డీఎంకేను బీజేపీ ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

2,801 Views

You may also like

Leave a Comment