
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 10
నేడు తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఏపీ స్టేట్ నూర్ భాషా /దూదేకుల వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం టిడిపి నాయకులు వారి కుటుంబ సభ్యుల కేరింతలు మధ్య కోలాహలంగా అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె.నాగుల్ మీరా మరియు డాక్టర్ నాగూరు వీరభద్రుడు గారితో కలిపి 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మామింద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పటిలాగే చేస్తామని ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు, మాజీ శాసనమండలి చైర్మన్,ex ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్ విజయవాడ వెస్ట్ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. మరియు సిద్ధవటం మండలంలోని పలువురు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు కుటుంబ సభ్యులు మరియు వీరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.