కంబాల ఆధ్వర్యంలో అంగరంగ, వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
వేలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, గురు స్వాములు
VRM Media (ఐ భద్రం)
తూర్పుగోదావరి జిల్లా గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు, శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం దంపతుల ఆధ్వర్యంలో
శనివారం రాత్రి గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ ప్రాంగణంలో భారీ మండపంతో పాటు, మీరమెట్లు కొలిపే విద్యుత్ కాంతులు, బానసంచా కాల్పులతో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో , కనుల పండుగగా జరిగింది.
డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ గారు, కుమార్ గురు స్వామి గారు సమక్షంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి గోకవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా అయ్యప్ప స్వాములు, గురు స్వాములు తరలివచ్చారు.
తొలిత కంబాల శ్రీనివాసరావు గారి దంపతులు, ప్రసాద్ గారి దంపతులు విఘ్నేశ్వరి స్వామి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు, యువత, సేవకులు తదితరులు పాల్గొన్నారు.
We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.