Home Uncategorized వెంకట్ డాన్స్ అకాడమీ డాన్స్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించిన డాక్టర్ లక్ష్మీ ఆకుల

వెంకట్ డాన్స్ అకాడమీ డాన్స్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించిన డాక్టర్ లక్ష్మీ ఆకుల

by VRM Media
0 comments

ఖమ్మం జాన్ 4:

ఖమ్మంపట్టణానికి చెందిన వెంకట్ డాన్స్ అకాడమీ (VDA) ఆధ్వర్యంలో, VBCC యూత్ సహకారంతో నిర్వహించనున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి డాన్స్ పోటీల బ్రోచర్‌ను ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకురాలు డాక్టర్ లక్ష్మీ ఆకుల ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ఆకుల మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి డాన్స్ పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నేటి తరం పిల్లలు విద్యతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని సూచించారు. కళాకారులను ప్రోత్సహించేందుకు వెంకట్ డాన్స్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.డాక్టర్ లక్ష్మీ ఆకుల బటర్ఫ్లై స్పెషల్ వింగ్గ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా, అలాగే ఋగ్వేదం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకురాలు మరియు కరస్పాండెంట్‌గా సేవలందిస్తూ విద్యా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఆంకాలజీ విభాగంలో పరిశోధకురాలిగా కూడా సేవలందిస్తున్నారు.వెంకట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు జూన్ 14న ఇల్లందులోని సి ఈ ఆర్ క్లబ్ ప్రాంగణంలో జరగనున్నట్లు నిర్వాహకులు కడారి వెంకటేష్ మరియు సాయి మాస్టర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టచ్ స్టూడియో అధినేత రాకేష్ రెడ్డి మీరా, షబ్బీర్ , ఇల్లందు సీనియర్ డాన్స్ మాస్టర్ రాజేష్ మాస్టర్ ,కళాకారులు, యువజన ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

2,805 Views

You may also like

Leave a Comment