
ఏలేశ్వరం, VRM MEDIA న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్26:–
ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా వల్లీ దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున నుండి భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు.ఈ సందర్బంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు అచ్చిబాబు,ప్రత్యేక అభిషేకాలు,పూజలు చేపట్టారు.గ్రామంలో భక్తులు తెల్లవారు జాము నుండి స్వామివారిని దర్శించికొని భక్తి శ్రద్దలతో పూజలలో పాల్గొన్నారు.ఆలయం ప్రాంగణంలో గల పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు.పాలు,గ్రుడ్లు వేసి నగేంద్రునికి పూజలు చేశారు.సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన యర్రవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.