


కడప జిల్లా VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ డిసెంబర్ 10
కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ & కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్ప మాధవి రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన మాధవి రెడ్డి , సంబంధిత శాఖల అధికారులతో తక్షణమే స్పందిస్తూ, ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందేలా అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు పెండింగ్ లేకుండా పరిష్కారం కావాలని అధికారులకు స్పష్టంగా సూచించారు.
ప్రజల సమస్యలకు ప్రత్యక్షంగా స్పందిస్తూ, అవసరమైన చోట ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతామని ఆమె తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని మాధవి రెడ్డి పేర్కొన్నారు.