
కార్యకర్తలతో చమర్తి సమీక్ష సమావేశం.
రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 12
ఎన్డీఏ కూటమి ప్రభుత్వా హయాంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ఇంటికి చేరేలా నాయకులు ఏ నాగ ముని రెడ్డి కార్యకర్తలు కృషి చేయాలని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు – నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టిడిపి నాయకులు, ఏ నాగ ముని రెడ్డి కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని,ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించాలని,ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించాలన్నారు.