
సీఎం మామయ్య, కడప జిల్లా ముద్దు మామయ్య
సిద్ధవటం, VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 12
సిద్ధవటం మండలాల విభజన కొరకై తలపెట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాలు రోజురోజుకు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడి పలు విద్యాసంస్థల విద్యార్థులు సైతం ఉద్యమాల్లో కొనసాగారు సిద్ధవటం మండలం లోని మాధవరం 1 గ్రామంలో మండలాల విభజన సాధన కొరకై ఏర్పాటుచేసిన 2 వ రోజు రిలే నిరాహార దీక్షలో పలు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి రాయచోటి జిల్లా వద్దు, కడప జిల్లా ముద్దు అంటూ వినోదాలు చేస్తూ సీఎం మామయ్య మా భవిష్యత్తు కొరకై సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలో విలీనం చేయాలని లేనిపక్షంలో ఉద్యమాలు కొనసాగింపు చేస్తామన్నారు జేఏసీ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాజంపేట జిల్లా ప్రకటించకుండా తప్పిదం చేసి రాయచోటి జిల్లా కేంద్రం చేశారని అన్ని పార్టీల నేతలు జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమాలు కొనసాగిస్తున్నామని రాజంపేట జిల్లా కేంద్రానికి అన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించి విలీనం చేయాలని లేనిపక్షంలో కడప జిల్లాలో కొనసాగించాలని తెలిపారు సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మా ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు జిల్లా కేంద్రంగా పరిపాలన చేసిన సిద్ధవటం ఒక మహా పుణ్యక్షేత్రం, గా భావిస్తారని అలాంటి మండలాన్ని నల్ల రాయి కొండ ప్రాంతాల్లో విలీనం పట్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జిల్లా సర్వోన్నత అధికారి ప్రజల మనోభావాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి తప్పదని హెచ్చరించారు దీక్ష శిబిరాలకు సంఘీభావంగా, సింగల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు, మాజీ టిడిపి అధ్యక్షులు మోహన్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నేతలు, ఎన్నారై చంద్ర, డేరంగుల, శ్రీకాంత్, నాయబ్ రసూల్, డాక్టర్ లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్, వినోద్, శ్రీరామదాసు వెంకట్, తదితర జేఏసీ నేతలు విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు మహిళలు పాల్గొన్నారు