కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఈ ఈశ్వర్ డిసెంబర్ 22
చలో కలెక్టరేట్ సూపర్ సక్సెస్
సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్
ఒంటిమిట్ట, సిద్ధవటం , కడప,అంతర్భాగమే
టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి
ఇన్నాళ్లు నిశ్శబ్దంగా 12 రోజులుగా సిద్ధవటం మండల సాధన కొరకై చేస్తున్న రిలే నిరాహార దీక్ష ల ఉద్యమం రెట్టింపు చేశారు ఉమ్మడి జేఏసీ సభ్యులు చలో కలెక్టరేట్ పిలుపుమేరకు సోమవారం కడప నగరం నందు సిద్ధవటం ఒంటిమిట్ట రెండు మండలాలు రాయచోటిలో గెజిట్ నోటిఫికేషన్ విలీనం రద్దు చేయాలని ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద గొంతెత్తి తమ హక్కుల కోసం బైఠాయించడంతో ఉద్రిక్తత ఏర్పడింది జిల్లా కలెక్టర్ కు తమ ఆంక్షలు డిమాండ్లు గట్టిగా వినిపించేలా నినాదాలు చేశారు దేశానికి స్వాతంత్రం రాకముందు సిద్ధవటం జిల్లా పరిపాలన కేంద్రంగా కొనసాగిందని పెన్నా నదికి తరచూ వరద నీరు రావడంతోరాకపోకలు స్తంభించడంతో జిల్లా కేంద్రాన్ని కడపకు తరలింపు చేశారని కడప నగర ప్రజలకు లింగంపల్లి పెన్నా నది నుండి త్రాగునీరు సరపరా అవుతున్నాయని కడప చెన్నై జాతీయ రహదారి జేఎంజే కళాశాల వరకు సిద్ధవటం మండల పరిధిలోకి వస్తుందని , కడప అంతర్భాగమైన సిద్ధవటం 85, కి, మీ ,దూర ప్రాంతమైన అన్నమయ్య జిల్లా రాయచోటిలో విలినం తగదని ప్రజలు మండిపడ్డారు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రజల మనోభావాలను దెబ్బ తినే విధంగా విభజించి, పాలిస్తున్నారని కడప జిల్లాలో ఒంటిమిట్ట, సిద్ధవటం గ్రామాలు విలీనం చేసే అంతవరకు ఉద్యమాలు రెట్టింపు చేస్తామన్నారు
ఉమ్మడి జేఏసీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా మండలాలు విలీనం చేయడంతగదని చేనేత కార్మికులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు వృద్ధులు రాయచోటి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది పడతారని అధికారులు పరిశీలించి రెండు మండలాలు ప్రజల మనోభావాల మేరకు కడప జిల్లాలో విలీనం చేయాలని తెలిపారు
జిల్లా కలెక్టర్ కు, వినతి
ఒంటిమిట్ట సిద్దవటం మండలాల జేఏసీ కార్యవర్గ సభ్యులు టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో కార్యవర్గ సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు వినతి పత్రం సమర్పించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 31 తేదీ గెజిట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు తెలుపవచ్చని ప్రజల మనోభావాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయం తెలుపుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు రాష్ట్ర టిడిపి పొలిట్ బ్యూరో కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రాయచోటి జిల్లాలో విలీనంపై ప్రజల అభ్యంతరాలు బలంగా ఉన్నాయని సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలో అంతర్భాగమే అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మనోభావాలు గుర్తించి న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉందని రెండు మండలాలు కడప జిల్లాలో విలీనం తప్పకుండా జరుగుతుంది అని తెలిపారు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవిన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్య నిర్వహణ కార్యదర్శి బాలశెట్టి హరిప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ హరింద్ర నాథ్ ఉమ్మడి మండలాలజేఏసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

