కోలాటం గజ్జ పూజ కార్యక్రమానికి 1,50,000 రూపాయలు విరాళం
తూర్పుగోదావరి జిల్లా, గోకవరం డ్రైవర్స్ కాలానికి చెందిన మహిళలు మన ప్రాచీన కాలం నాటి అద్భుతమైన కల “కోలాటం” నృత్యాలను నేర్చుకుంటున్నారు.
కోలాటం నేర్చుకున్న అనంతరం గజ్జ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించాలని డ్రైవర్ కాలనీకి చెందిన పలువురు మహిళలు
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు వచ్చి ఇటీవలే కోరారు.
తక్షణమే స్పందించిన ఆయన మన ప్రాచీన కలలను ప్రోత్సహించాలని సంకల్పంతో వారికి 1,50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. విరాళం చెక్ ను గోకవరం సీఎండీ కార్యాలయం వద్ద మహిళలకు అందజేశారు..