నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ రవిబాబు ఆధ్వర్యంలో
VRM న్యూస్ బాల మౌలాలి ఏప్రిల్14
ఒంటిమిట్ట: ప్రపంచ చరిత్రలో అతి పెద్ద రాజ్యాంగం నిర్మించి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉదయించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తహసిల్దార్ దామోదర్ రెడ్డి, డిప్యూటీ ఎంపిడిఓ చలపతి, ఎస్ఐ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం ఆవరణంలో 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తహసిల్దార్ దామోదర్ రెడ్డి, డిప్యూటీ ఎంపిడిఓ చలపతి, ఎస్ఐ శ్రీనివాసులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారితోపాటు సిపిఎం కే నరసయ్య కలిసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..భారత దేశంలో ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని సమాన హక్కుతో అనుభవిస్తున్నారంటే ఆది డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం పుణ్యమే అన్నారు. ఎలాంటి ప్రచార మౌలిక సదుపాయాలు లేని కాలంలో కూడా దేశ దేశాలు తిరిగి దృఢమైన రాజ్యాంగాన్ని నిర్మించి అన్ని అణగారిన వర్గాలను సమానంగా చూసేలా భారత దేశంలో అందరూ సమానమేనని సంకల్పాన్ని ఏకతాటిపై తెచ్చిన దార్శనికుడు, మహోన్నత వ్యక్తి జై భీం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని పేర్కొనారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి కిషోర్, నరవకాటి పల్లి పంచాయతీ కార్యదర్శి దినేష్, గంగ పేరూరు పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, ఒంటిమిట్ట సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ దీపిక, అంబేద్కర్ మిషన్ మండల అధ్యక్షుడు కత్తి చంద్ర, గౌరవ అధ్యక్షుడు గద్దె నాగేశ్వరరావు, సభ్యులు గాలిశెట్టి చంద్ర, పెంచలయ్య, రమణ, మద్దెల శివకుమార్, మద్దెల వెంకటయ్య. రవి శంకర్. నాగరాజు. గంగయ్య. మాడుపూరు నరసింహులు. చంద్రపాల్ పాల్గొన్నారు.
