Home Uncategorized ఒంటిమిట్ట ప్రెస్ క్లబ్ ప్రారంభం

ఒంటిమిట్ట ప్రెస్ క్లబ్ ప్రారంభం

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఏప్రిల్ 14

ఒంటిమిట్ట: మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని అంబేద్కర్ భవనాన్ని మంగళవారం ఒంటిమిట్ట ప్రెస్ క్లబ్ గా మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులంతా ఏకీభవించిన కారణంగా కమ్యూనిటీ లీడర్ కత్తి చంద్ర అంగీకారంతో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి పర్వదినాన మండల రెవెన్యూ అధికారి(తహసిల్దార్) దామోదర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వీరు రిబ్బన్ కట్ చేసి ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ…రాబోయే కాలంలో ఒంటిమిట్ట ప్రెస్ క్లబ్ ను అంచలంచెలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులంతా ఒకేతాటిపై ఉండి, వారి ఐక్యమత్యాన్ని చాటుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులు చిన్నపు రవిబాబు, సుబ్బరామయ్య, మురళి, గుండ్రాతి మహేశ్వరయ్య, షేక్ మూస, ఒంటిమిట్ట ఆదినారాయణ, కత్తి జగదీష్, బాల మౌలాలి, గోపి తదితరులు పాల్గొన్నారు.

2,803 Views

You may also like

Leave a Comment