Home ట్రెండింగ్ మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? | యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను మధ్యవర్తిత్వం చేయడానికి చైనా కొత్త నాలుగు పాయింట్ల శాంతి ప్రణాళికను ఆవిష్కరించింది – VRM MEDIA

మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? | యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను మధ్యవర్తిత్వం చేయడానికి చైనా కొత్త నాలుగు పాయింట్ల శాంతి ప్రణాళికను ఆవిష్కరించింది – VRM MEDIA

by VRM Media
0 comments
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? | యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను మధ్యవర్తిత్వం చేయడానికి చైనా కొత్త నాలుగు పాయింట్ల శాంతి ప్రణాళికను ఆవిష్కరించింది


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం లేదు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే. దాంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం. ఇప్పటికే హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం కారణంగా హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మేరకు అమెరికా నేవీ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇక మళ్లీ ఇరాన్- అమెరికా మధ్య రెండో చర్చలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇరాన్- అమెరికా మధ్య పాకిస్థాన్ లేదా స్విట్జర్లాండ్ వేదికగా మరోసారి ఉన్నత స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. రెండో విడత చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనే జరిగే అవకాశం ఉందని అమెరికా మీడియా నివేదికలు వివరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడీ రణరంగంలోకి చైనా వచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నాలుగు అంశాలను ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయాలను బీజింగ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేత షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిగిన కీలక సమావేశంలో ఆయన నిర్వహించారు.

జిన్ పింగ్ వివరించిన విషయాలు చూస్తే.. శాంతియుతంగా సహజీవనంగా ఉండటం.. అంటే పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో ఒక సుస్థిరమైన భద్రతా వ్యవస్థను నిర్మించాలని చైనా పిలుపునిచ్చింది. దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించే విధంగా సహకారాన్ని పెంచాలని సూచనలు చేసింది. అలాగే రెండో అంశంగా జాతీయ సార్వభౌమాధికారం.. అనగా ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను మధ్యవర్తిత్వం చేయడానికి చైనా కొత్త నాలుగు పాయింట్ల శాంతి ప్రణాళికను ఆవిష్కరించింది

ఇక మూడో అంశంగా అభివృద్ధితో భద్రత అని. అంటే ఆర్థిక ప్రగతి ఉంటేనే శాంతిని నెలకొల్పడం సులభం అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెప్పారు. ఇక చివరి అంశంగా అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తమకు నచ్చినట్లుగా వాడుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఇక ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య గత 40 రోజులకుపైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే..

2,804 Views

You may also like

Leave a Comment