Home Uncategorized ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జి రెడ్డి గుర్తేడు మండలంలో ప్రత్యేక దృష్టితో వికలాంగుల సమస్యలపై సుడిగాలి పర్యటన నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జి రెడ్డి గుర్తేడు మండలంలో ప్రత్యేక దృష్టితో వికలాంగుల సమస్యలపై సుడిగాలి పర్యటన నిర్వహించారు.

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం
తేదీ: 16-04-2026

స్థలం: పోలవరం జిల్లా, గుర్తేడు మండలం

ఈ పర్యటనలో భాగంగా వై. రామవరం మండలం చింతలపూడి పంచాయతీ పరిధిలోని పెరకావలస గ్రామాన్ని సందర్శించి వికలాంగులను పరామర్శించారు. వారి ఆధార్ కార్డు అప్డేట్ వివరాలు తెలుసుకుని, వ్యక్తిగత సమస్యలను ఆరా తీశారు. పుట్టగండి గ్రామ ప్రజలను కలసి రహదారి సమస్యలపై చర్చించారు.

గుర్తేడు మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన చైర్మన్ కి, గ్రామ ప్రజలు రోడ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. ఎడ్లకొండ గ్రామంలో పింఛన్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. పులుసుమామిడిలంక గ్రామ ప్రజలు కొత్త ఇళ్ల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.

పెద్దకొండ గ్రామంలో పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు ప్రభుత్వ పింఛన్ అందడం లేదని గ్రామస్తులు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. బొడ్డగండి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పింఛన్ సమస్యలతో పాటు హౌసింగ్ పనులు మధ్యలో ఆగిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో వికలాంగులను గుర్తించి వారికి అవసరమైన సేవలు అందిస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు.

సపరాయి గ్రామంలో ఒకే కుటుంబంలో ఇద్దరు వికలాంగులు ఉన్నప్పటికీ వారి ఆధార్ అప్డేట్ కాకపోవడంతో పింఛన్ అందడం లేదని గుర్తించారు. కానివాడ గ్రామంలో సుమారు ఆరుగురు వికలాంగులు ఉన్నారని గుర్తించి, వారికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని తెలుసుకున్నారు.

చెక్కవాడ గ్రామంలో రెండు కుటుంబాల్లో వికలాంగులు ఉన్నట్లు గుర్తించి, వారి కుటుంబాలను కలసి సమస్యలు తెలుసుకున్నారు. ఆ చిన్నారులకు తన వంతు సహాయం అందిస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు.

ఈ సుడిగాలి పర్యటనలో భాగంగా గుర్తేడు మండలంలోని పలు గ్రామాలను సందర్శించి, సుమారు 30 మంది వికలాంగులను గుర్తించారు.

ఈ కార్యక్రమంలో ATW జే. సాంబడు , డా. పల్లాల రాజాకుమార్ రెడ్డి సాదల ప్రేమ కుమార్ రెడ్డి , కర్రీ సన్యాసి రెడ్డి , కత్తుల రమణ రెడ్డి పల్లాల లచ్చిరెడ్డి (టీచర్), కొండ్ల విజయ్ కుమార్ రెడ్డి , మడకం రమణదొర , కొండ్ల విజయ్ సాగర్ రెడ్డి , కొండ్ల శివశంకర్ రెడ్డి సాదల బాబురావు రెడ్డి , ఎస్. రవీంద్ర రెడ్డి మడకం ప్రసాద్ దొర తదితరులు పాల్గొన్నారు.

గిరిజన ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో చైర్మన్ చిట్టచివరి గ్రామాల వరకు వెళ్లి, సమయపరిమితి లేకుండా సేవలు అందించాలనే తన అభిలాషను వ్యక్తం చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి చివరి గ్రామానికి చేరాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు.

2,807 Views

You may also like

Leave a Comment