Home ట్రెండింగ్ స్టాలిన్ చివరి అస్త్రం, ‘చెన్నై సూపర్-6’ | స్టాలిన్ ‘చెన్నై సూపర్-6’ విజన్: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే ప్రతిష్టాత్మక మేనిఫెస్టోను ఆవిష్కరించింది. – VRM MEDIA

స్టాలిన్ చివరి అస్త్రం, ‘చెన్నై సూపర్-6’ | స్టాలిన్ ‘చెన్నై సూపర్-6’ విజన్: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే ప్రతిష్టాత్మక మేనిఫెస్టోను ఆవిష్కరించింది. – VRM MEDIA

by VRM Media
0 comments
స్టాలిన్ చివరి అస్త్రం, 'చెన్నై సూపర్-6' | స్టాలిన్ 'చెన్నై సూపర్-6' విజన్: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే ప్రతిష్టాత్మక మేనిఫెస్టోను ఆవిష్కరించింది.


భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన మార్క్ పాలిటిక్స్‌తో దూకుడు పెంచారు. ఆదివారం అన్నా అరివాలయంలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో “ద్రావిడన్ మోడల్ 2.0” కింద రూపొందించిన “చెన్నై సూపర్-6” ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, గడువులతో కూడిన అభివృద్ధి మ్యాప్‌ను సిద్ధం చేయడం ఈ మేనిఫెస్టో ప్రత్యేకత.

‘చెన్నై సూపర్-6’ ఏమిటి?

చెన్నై నగరాన్ని సాంకేతికత, సంస్కృతి, సౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు ఆరు ప్రధాన అంశాలు డీఎంకే ఏంచుకుంది.

  • ప్రజా సౌకర్యాల మెరుగుదల: మహిళా సంఘాల భాగస్వామ్యంతో గృహ వసతి ప్రాజెక్టుల ఆధునీకరణ.
  • బలోపేతమైన రవాణా: చివరి మైలు వరకు నిరంతర కనెక్టివిటీ.
  • గడువుతో కూడిన ప్రాజెక్టులు: నిర్ణీత కాలంలో ప్రాథమిక సౌకర్యాలు పూర్తి.
  • శాస్త్రీయ వీధికుక్కల నిర్వహణ: మానవీయ కోణంలో యానిమల్ బర్త్ కంట్రోల్.
  • ప్రపంచ సాంకేతిక కేంద్రం: ఐటీ , ఎమర్జింగ్ టెక్నాలజీలకు భారీ హబ్.
  • గ్లోబల్ టాలెంట్ గేట్‌వే: యువతకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణ.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం స్టాలిన్ చెన్నై సూపర్-6 విజన్ డీఎంకే ప్రతిష్టాత్మక మేనిఫెస్టోను ఆవిష్కరించింది.

రవాణా రంగంలో AI విప్లవం.. 1000 నిమిషాల బస్సులు!

చెన్నైలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు స్టా సర్కార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను నమ్ముకుంది. AI ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ ద్వారా ప్రయాణ సమయాన్ని 25 శాతం తగ్గించడమే కాకుండా, మెట్రో , రైల్వే స్టేషన్ల నుండి ఇళ్లకు చేరుకోవడానికి వీలుగా 1,000 కొత్త మినీ బస్సులను ప్రవేశపెట్టేందుకు వీలు కల్పిస్తుంది. 2029 నాటికి పాదచారుల కోసం నీడతో కూడిన విశాలమైన ఫుట్‌పాట్‌లు, ఆధునిక టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి.

రూ.10,000 కోట్లతో టెక్ హబ్.. 20,000 ఉద్యోగాలు!’

నిరుద్యోగ యువతకు ఈ మేనిఫెస్టో ఒక తీపి కబురు అందించింది. AI, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గేమింగ్ వంటి రంగాల కోసం ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడితో వరల్డ్ క్లాస్ టెక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 20,000 హై-శాలరీ ఉద్యోగాలను సృష్టించాలని డీఎంకే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుబంధంగా “గ్లోబల్ టాలెంట్ గేట్‌వే” ద్వారా అంతర్జాతీయ కంపెనీలకు అవసరమైన నిపుణులను చెన్నైలోనే తయారు చేస్తారు.

2027-2028: డెడ్ లైన్ ఫిక్స్!

చాలా ప్రాజెక్టులు ఏళ్లతరబడి సాగకుండా ఉండేలా ఈసారి అనుమతిని ప్రకటించారు.

  • 2027 నాటికి: చెన్నై పెరిఫెరల్ రోడ్డు, అండర్‌గ్రౌండ్ మురుగునీటి పారుదల పనులు పూర్తి.
  • 2028 నాటికి: మెట్రో రైలు రెండో దశ విస్తరణ, తుఫాను నీటి కాల్వల నిర్మాణం పూర్తి.

మెట్రో నీరు అందే నిరంతర సరఫరా, లేని చోట్ల స్వచ్ఛమైన ఆర్వో (RO) నీటిని అందజేసేలా హామీ ఇచ్చింది. భద్రత కోసం హైమాస్ట్ వీధి దీపాలు, సంగీత, సాహిత్య కళాకారుల కోసం భారీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ఈ ప్లాన్‌లో చేర్చారు.

మొత్తానికి, “చెన్నై సూపర్-6” విజన్ నగరవాసుల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా, చెన్నైని ఒక గ్లోబల్ సిటీగా మార్చేందుకు సమగ్ర రోడ్‌మ్యాప్‌ను అందించింది. డీఎంకే ప్రకటించిన ఈ టెక్-టచ్ మేనిఫెస్టో ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి!

2,808 Views

You may also like

Leave a Comment