
కన్నడ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ‘సెకండ్ కేసు ఆఫ్ సీతారామ్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, అనేగుండ్ల అనే ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరి వరుసగా జరుగుతున్న హత్యలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంటాయి. ఈ కేసును ఛేదించడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సీతారామ్ రంగంలోకి దిగుతాడు. ఆ హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? నిందితులను పట్టుకునే సీతారాం ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనే అంశాలను దర్శకుడు దేవిప్రసాద్ శెట్టి ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
విజయ్ రాఘవేంద్ర గతంలో నటించిన ‘సీతారామ్ బినోయ్: కేసు నెం. 18’ చిత్రం వచ్చిన ఇది సీక్వెల్‌గా ఉన్నప్పటికీ, పూర్తి భిన్నమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విజయ్ తన నటనతో మరోసారి మెప్పించారు. సహజత్వానికి దగ్గరగా ఉంటూనే, ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచే స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలం.
ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో కన్నడ భాషలో అందుబాటులో ఉంది. అయితే, తెలుగు సినీ ప్రియుల కోసం ఈ సినిమా త్వరలోనే తెలుగు ఆడియోలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాది భాషల్లో క్రైమ్ థ్రిల్లర్లకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు.
నవనీత్ శామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు హేమంత్ ఆచార్య సినిమాటోగ్రఫీ ఈ థ్రిల్లర్ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ బాజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్‌ను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’ ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. త్వరలోనే తెలుగు స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.