Home ఎంటర్‌టెయిన్మెంట్ రీ-ఎంట్రీ ఇస్తున్న అప్పటి స్టార్ హీరోయిన్.. 22 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా! – VRM MEDIA

రీ-ఎంట్రీ ఇస్తున్న అప్పటి స్టార్ హీరోయిన్.. 22 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


తనదైన నటనతో, అందంతో ఒకప్పుడు కుర్రకారుని హృదయాలను కొల్లగొట్టిన నటి లైలా (లైలా). సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్ళీ తెలుగుతెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘గోదారి గట్టుపైన’ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమాలో ‘ఝాన్సీ’ అనే పవర్ ఫుల్ పాత్రను లైలా పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఆమె ఎంతో హుందాగా, సంప్రదాయబద్ధమైన చీరకట్టులో కనిపిస్తున్నారు. తన నటనతో మరోసారి అందరి మనసు గెలుచుకోనున్నారని ఈ పోస్టర్ తో స్పష్టమవుతోంది.

తెలుగులో లైలా నటించిన చివరి చిత్రం 2004లో వచ్చిన ‘మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి’. ఏకంగా 22 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించడం విశేషం.

అభినవ్ రావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి నేపథ్యంతో సాగే భావోద్వేగపూరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

వేసవి తాపాన్ని తగ్గించే చల్లని గోదావరి గాలిలా ఈ సినిమా రాబోతోంది. ‘గోదారి గట్టుపైన’ మే 8న ఘనంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగులో లైలా సెకండ్‌లకు ఒక గొప్ప ఆరంభాన్ని ఇస్తుందేమో చూడాలి.

2,801 Views

You may also like

Leave a Comment