Home ట్రెండింగ్ మన దేశ జనాభా ఎంతో తెలుసా? | జాతీయ జనాభా నివేదిక 2026: 2036 నాటికి 152 కోట్ల అంచనాలతో 142 కోట్ల మంది భారతీయులు మరియు విద్య ఖర్చు అంతర్దృష్టులు – VRM MEDIA

మన దేశ జనాభా ఎంతో తెలుసా? | జాతీయ జనాభా నివేదిక 2026: 2036 నాటికి 152 కోట్ల అంచనాలతో 142 కోట్ల మంది భారతీయులు మరియు విద్య ఖర్చు అంతర్దృష్టులు – VRM MEDIA

by VRM Media
0 comments
మన దేశ జనాభా ఎంతో తెలుసా? | జాతీయ జనాభా నివేదిక 2026: 2036 నాటికి 152 కోట్ల అంచనాలతో 142 కోట్ల మంది భారతీయులు మరియు విద్య ఖర్చు అంతర్దృష్టులు


భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

ప్రస్తుతం దేశ జనాభా 142.58 కోట్లుగా ఉండగా, ఇందులో 73.20 కోట్ల మంది పురుషులు, 69.38 కోట్ల మంది మహిళలు ఉన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక అంచనా వేసింది. 2036 నాటికి దేశ జనాభా మరో 10 కోట్లు పెరిగి 152.58 కోట్లకు చేరుతుందని. కాగా, దేశంలో లింగ నిష్పత్తి మెరుగుపడటం ఒక సానుకూలమైనది. ప్రతి 1000 మంది బాలురకు బాలికల సంఖ్య 904 నుంచి 917కు పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే అరుణాచల్ ప్రదేశ్ (1085) అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ (906), ఆంధ్రప్రదేశ్ (931) రాష్ట్రాలు జాతీయ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి.

అక్షరాస్యత – జీవన ప్రమాణాలు

దేశ సగటు అక్షరాస్యత 77.7 దశ చేరింది. అక్షరాస్యత పెరగడంతో వివాహ వయసులోనూ మార్పు మొదలైంది. 2023 నాటికి యువతుల సగటు వివాహ వయసు 22.4 ఏళ్లుగా ఉంది. అలాగే భారతీయుల సగటు జీవితకాలం కూడా పెరుగుతోంది; 2036 ఏళ్ల వయస్సులో మహిళల సగటు వయసు 74.7 ఏళ్లు, పురుషులది 71.2కు చేరుతుందని అంచనా. అయితే శిశుమరణాల రేటు ఆంధ్రప్రదేశ్‌లో 22, తెలంగాణలో 20గా ఉండగా, మధ్యప్రదేశ్‌ (41) ఈ జాబితాలో అత్యంత వెనుకబడి ఉంది.

జాతీయ జనాభా నివేదిక 2026 2036 నాటికి 152 కోట్ల అంచనాలతో 142 కోట్ల మంది భారతీయులు మరియు విద్య ఖర్చు అంతర్దృష్టులు

న్యాయవ్యవస్థ – రాజకీయాల్లో మహిళల వాటా..

కీలకమైన నిర్ణయాధికారాల్లో మహిళల ప్రాబల్యం ఇంకా ఆశాజనకంగా లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో కేవలం 3.03% మంది మాత్రమే మహిళలు ఉండగా, హైకోర్టులలో ఈ సంఖ్య 14.30 శాతంగా ఉంది. రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి. పార్లమెంటులో 13.65%, కేంద్ర మంత్రివర్గంలో 9.86% మాత్రమే మహిళలు ఉన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల 49.75% మంది మహిళా ప్రజాప్రతినిధులు రావడం విశేషం. కాగా, ఇంటి విషయాల్లో మహిళల పాత్ర 90% గృహాల్లో బలంగా ఉంది.

ఆరోగ్యం – శారీరక శ్రమ

ఆరోగ్య పరంగా ఊబకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. 15-49 ఏళ్ల మధ్య మహిళల్లో ఊబకాయం 20% నుంచి 24%కి పెరిగింది. పొగాకు వాడకం విషయంలో తెలుగు రాష్ట్రాల్లో పురుషులు (22% పైగా) ముందున్నారు. ఇక పనుల విభజనలో అసమానతలు కొనసాగుతున్నాయి. మహిళలు ఇంటి పనుల కోసం రోజుకు సగటున 289 నిమిషాలు కేటాయిస్తుండగా, పురుషులు కేవలం 88 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నారు.

వేతన వ్యత్యాసం – విద్యా ఖర్చులు

రోజువారీ వేతనాల్లో లింగ వివక్ష స్పష్టంగా కనిపించింది. కేరళలో పురుషులకు అత్యధికంగా రూ.970 కూలి లభిస్తుంటే, మహిళలకు కేవలం రూ.448 మాత్రమే దక్కుతోంది. పశ్చిమ బెంగాల్, హరియాణాల్లో మాత్రం మహిళా కూలీలు మెరుగైన వేతనం అందుకుంటున్నారు. మరోవైపు విద్యా వ్యయం పెరుగుతోంది. పాఠశాల విద్యపై తెలంగాణ ఒక్కో విద్యార్థికి రూ.21,652 ఖర్చు చేస్తూ దేశంలోనే మూడో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రూ.19,334తో ఏడో స్థానంలో నిలిచింది. పట్టణ ప్రాంతాల్లో ఈ ఖర్చు తెలంగాణలో మరింత అధికంగా (రూ31,633) ఉంది.

2,801 Views

You may also like

Leave a Comment