Home ఎంటర్‌టెయిన్మెంట్ పెళ్లి పీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఉప ముఖ్యమంత్రి హాజరు – VRM MEDIA

పెళ్లి పీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఉప ముఖ్యమంత్రి హాజరు – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(సాయి శ్రీనివాస్)తన ప్రేయసి, ఫ్రెండ్ కావ్య రెడ్డి(కావ్యా రెడ్డి)ని తన శ్రీమతిగా మార్చుకున్నాడు. నిన్న ఆ ఇద్దరి వివాహం తిరుమల(తిరుమల)కొండపై కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వాడి సన్నిధిలో స్వామి ఆశీస్సులతో శాస్త్రోక్తంగా అత్యంత ఘనంగా జరిగింది. సుప్రభాత సమయం తర్వాత పండితుల ముహూర్తానికి కావ్య రెడ్డి మెడలో శ్రీనివాస్ మూడు ముళ్లు వేసాడు.

ఈ వివాహ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే. వివాహ వేడుక అంతా అచ్చ తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరిగింది. శ్రీనివాస్ పట్టు వస్త్రాల్లో మెరిసిపోగా, కావ్య రెడ్డి సాంప్రదాయ పట్టుచీరలో కలకలాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో వివాహ వేడుక జరిగింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కూడా చదవండి: ఇండియన్ సినిమా బెస్ట్ హారర్ థ్రిల్లర్ తుంబాడ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తమ హీరోకి “హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అంటూ మెసేజ్‌లతో ముంచెత్తుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి),ఎన్టీఆర్(ఎన్టీఆర్) వంటి హీరోలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం, అభిమానుల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు.

2,802 Views

You may also like

Leave a Comment