
అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
ప్రపంచంలోని అనేక దేశాల్లో వింత వింత ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయి. అందులో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. అలాంటివి ఇతర దేశాలకూ విస్తరించాయి. కొన్ని మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్నాయి. అలాంటి వాటిలో నైజీరియాలోని ‘రేప్ ఫెస్టివల్’ ఒకటి.. నైజీరియాలోని డెల్టా రాష్ట్రంలో ఫెర్టిలిటీ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. అయితే ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారి తీస్తోంది. వీధుల్లో, రోడ్లపై మహిళలను పరిగెత్తించి.. బలవంతంగా వారి బట్టలను విప్పి అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొందరు మానవ మృగాలు. పురుషులు కొన్ని బృందాలుగా ఏర్పడి అక్కడి మహిళలను నగ్నంగా చేసి తమ కామ వాంఛ తీర్చుకుంటారు. ఇది బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ను ఓరముడు కమ్యూనిటీ నిర్వహిస్తోంది.
ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెర్టిలిటీ ఫెస్టివల్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నైజీరియాలోని మహిళలకు తగిన న్యాయం చేయాలి. ఈ ఫెర్టిలిటీ ఫెస్టివల్ లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో కొందరు పురుషులు గ్యాంగ్ లుగా ఏర్పడి మహిళలను ఛేదిస్తారు. అలా బలవంతంగా వారి దుస్తులను విప్పి నగ్నంగా చేసి తమ కోరికను తీర్చుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో అందరూ చూస్తుండగానే ఇలాంటి పనులు చేస్తుంటారు. వారికి ఎవరూ అడ్డుచెప్పకపోవడం. ఈ ఫెస్టివల్ లో అధికంగా యువకులు పాల్గొంటారు.
ఇక వీరి చేతిలో బలయ్యేది స్థానిక యూనివర్సిటీలోని విద్యార్థులు. దాంతో వెంటనే ఆ బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. అందులో ఓ బాధితురాలు, స్టూడెంట్ రోస్ మేరీ మాట్లాడుతూ.. తాను మోటర్ సైకిల్ పై ఆ దాడి రాగానే తనపై దాడులు జరిపాడు. నన్ను చూసిన కొందరు యువకులు.. ఆమె మహిళ.. పట్టుకోండి.. పట్టుకోండి.. అని అరిచారు. తేనెటీగల మాదిరి నా వెంట పడ్డారు. నా బట్టలను పూర్తిగా చింపేశారు. నా శరీరాన్ని మొత్తం తాకారు. నేను సాయం చేయండి అని అరిచాను. ఓ వ్యక్తి మధ్యలో కలుగజేసుకోవడంతో తాను బయటపడ్డాను. ఈ ఘటనలో నా మొబైల్ కొట్టేశారు. ఈ ఘటనపై నేను బాధపడుతున్నాను.. అని స్టూడెంట్ రోస్ మేరీ చెప్పుకొచ్చింది.

ఈలపై ఘటన సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తం కావడంతో ఇటీవల పోలీసులు ఈ కమ్యూనిటీ హెడ్ అయిన ఓమెరెడే సండేతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. మరోవైపు సంప్రదాయం పేరుతో మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ఇలాంటి పేరుతో మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి పద్దతులను అరికట్టాలని మానవ హక్కుల డిమాండ్ చేస్తున్నారు.