Home Uncategorized VRM మీడియా న్యూస్ | సత్తుపల్లి ప్రతినిధి | ఖమ్మం జిల్లా | మే 5, 2026

VRM మీడియా న్యూస్ | సత్తుపల్లి ప్రతినిధి | ఖమ్మం జిల్లా | మే 5, 2026

by VRM Media
0 comments

సత్తుపల్లిలో రైతు అవగాహన సదస్సు

సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో మంగళవారం “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నియోజకవర్గ స్థాయి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఆధునిక సాంకేతికతను అనుసరించాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఆయిల్ పామ్ సాగు విధానాలు, సమస్యలు–పరిష్కారాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

2,814 Views

You may also like

Leave a Comment