ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే మట్టా రాగమయి


సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపూరి కాలనీలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మంగళవారం మున్సిపల్ ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 23 వార్డుల్లో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి సమస్యలపై చర్చించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన రూ.25 కోట్ల నిధులతో చేపట్టే పనులపై దిశానిర్దేశం చేశారు.
ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.