Home Uncategorized మూడుముడులతో ఒక్కటైన జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్యే శిరీషాదేవి

మూడుముడులతో ఒక్కటైన జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్యే శిరీషాదేవి

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం

“పల్లి” వారి మాంగళ్య బంధం వేడుకలు

కిండ్ర పల్లి వారి వివాహ వేడుకలో సందడి చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి & నియోజక వర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్

మూడుముళ్లతో ఒక్కటైన జంట ముచ్చటగా ఉండాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆకాంక్షించారు. రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామంలో ఆదివారం పల్లి ఎర్రినాయుడు శ్రీమతి రమణమ్మ ల ఏకైక కుమారుడు వరుడు: చి; శివాజీ MBA & చి.. ల..సౌ ; దుర్గా భవాని M.COM ల మాంగళ్య బంధం నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి & ఆమె భర్త నియోజక వర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముత్యాల పెండ్లి పందిరిలో ముచ్చటగా మూడుముళ్లతో ఒక్కటైన జంటను ఆశీర్వ దించారు. సంప్రదాయ బద్దంగా వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన వివాహ వేడుకలలో నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
కిండ్ర “పల్లి” వారి వివాహ వేడుకలో ఆమె సందడి చేశారు. వివాహ వేడుకలకు హాజరైన వారిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, అందరితో సౌమ్యంగా ముచ్చటిస్తూ అందరినీ ఆకర్షించారు.

జీరెడ్డి వారి జన్మదిన వేడుకల్లో చి:రిషి సాయి కేశనాథ్ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దంపతులు

మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న జీరెడ్డి రిషి సాయి కేశనాథ్ ను రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మరియు రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ లు దీవించారు.
రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామంలో జీరెడ్డి వారి మొదటి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం నిర్వహించారు.. జీరెడ్డి శివ రామ కృష్ణ & నాగదేవి దంపతుల ముద్దుల కుమారుడు చి;జీరెడ్డి రిషి సాయి కేశనాథ్ జన్మదిన వేడుకలకు హాజరైన రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆమె భర్త నియోజక వర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ లు ఆశీర్వదించారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు.

ఈ సందర్భంగా ఆమెతో కలిసి పలువురు ఫోటోలు వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
ఆమెతో పాటు, జీరెడ్డి శివ రామ కృష్ణ, నాగదేవి, AMC డైరెక్టర్ కేశిరెడ్డి శివ శంకర వర ప్రసాద్ , పల్లి ఎర్రినాయుడు, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

2,805 Views

You may also like

Leave a Comment