తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెం వద్ద ఉన్న శ్రీ భూలోకమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు
లక్ష రూపాయలు విరాళం శనివారం కోరుకొండలోని రామసేన కార్యాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
గతంలో అలయం చుట్టు ప్రహరీ నిర్మాణానికి సహాయం అందించాలని, కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావు గారిని కోరారు. అప్పుడు ఆలయ అభివృద్ధి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.
శనివారం లక్ష రూపాయలు నగదును కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.