

అందమా… అందుమా.. అందనంటే అందమా..అని పాడుకునే పరిస్థితి ఇప్పుడు పూజిత పొన్నాడ(పూజిత పొన్నాడ)అభిమానులకి కల్పించింది. పాలతో కడిగిన పావురమా అనే రీతిలో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన గ్లామరస్ ఫోటోషూట్ లో పూజిత స్టన్నింగ్ లుక్స్ చూసి కుర్రాళ్ళు గుండె జారి గల్లంతవుతోంది. దీనితో ఆటోమెటిక్ గా ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి.
ఈ తాజా ఫోటోషూట్‌లో పూజిత తన సహజమైన అందంతో మరియు ఆకర్షణీయమైన చిరునవ్వుతో నెటిజన్లని అభిమానులని ఎంతగానో కట్టిపడేస్తోంది. ఆమె కళ్ళలోని మెరుపు, ముఖంలోని గ్లో చూసి అభిమానులు హార్ట్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడే ముఖకవళికలతో పాటు గ్లామర్ యాంగిల్ ని కూడా సమపాళ్లలో చూపిస్తూ పూజిత చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తన టాలెంట్ మరియు కష్టాన్నే నమ్ముకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి స్టార్‌డమ్ వైపు దూసుకుపోతున్న పూజిత ప్రయాణం నిజంగా అందరికో స్ఫూర్తిదాయకం. మరి ఆమె సినీ జర్నీ పై కూడా ఒక లుక్ వేద్దాం.
మొదట షార్ట్ ఫిలిమ్స్, మోడలింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత వెండితెరపై అవకాశాలను దక్కించుకుంది. 2016లో వచ్చిన ‘ఊపిరి’ సినిమాలో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమై రామ్ చరణ్, సుకుమార్ ల ‘రంగస్థలం’ తో భారీ బ్రేక్ అందుకుంది. ఈ చిత్రంలో నటుడు ఆది పినిశెట్టి ప్రేయసి పద్మ పాత్రలో పూజిత పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రంగస్థలం ఇచ్చిన గుర్తింపుతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ తన క్రేజ్ పెంచుకుంది.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్: విజయ్ తో పోలికలా! పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి, మిస్ ఇండియా, ఓదెల రైల్వే స్టేషన్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు,తమిళంలో దేశింగు రాజా వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ప్రస్తుతం పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. పూజిత స్వస్థలం విశాఖపట్నం. అచ్చ తెలుగు అమ్మాయి.