Home ఎంటర్‌టెయిన్మెంట్ జయం రవికి గుడ్ బై చెప్పేసిన కెనీషా.. అతడు ఇక మీవాడే అంటూ ఎమోషనల్ పోస్ట్ – VRM MEDIA

జయం రవికి గుడ్ బై చెప్పేసిన కెనీషా.. అతడు ఇక మీవాడే అంటూ ఎమోషనల్ పోస్ట్ – VRM MEDIA

by VRM Media
0 comments
జయం రవికి గుడ్ బై చెప్పేసిన కెనీషా.. అతడు ఇక మీవాడే అంటూ ఎమోషనల్ పోస్ట్


జయం రవి(జయం రవి)ఆయన భార్య ఆర్తి విడాకులకి నేను కారణం కాదంటూ నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ గాయని స్పిరిచువల్ హీలర్ కెనీషా ఫ్రాన్సిస్(Keneeshaa Francis)ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరో సంచలన పోస్ట్ చేసింది.

తన పోస్ట్ లో ‘నేను జయం రవితో బంధాన్ని తెంచుకుంటూ చెన్నైని వదిలి వెళ్ళిపోతున్నాను. నేను ఈ కథలోకి ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను. కానీ ఇప్పుడు పూర్తి నిశ్శబ్దంతో వెనుతిరుగుతున్నాను. కొన్ని చోట్ల అహంకారం, తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినప్పుడు మంచికి తావుండదు. ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో చాలా కోల్పోయాను. ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చే లోకం ఇది. ఇకపై ఎలాంటి వివరణలు ఇచ్చుకోను. నావి కానీ యుద్ధంలో కూడా నేను పోరాడలేను. సినిమా ఇండస్ట్రీకి, ప్రజలకు, అతడిని ఇష్టపడేవారికి, ద్వేషించేవారికి నేను చెప్పేది ఒక్కటే.. ‘అతడు ఇక పూర్తిగా మీవాడే’. నేను అతడిని పూర్తి ప్రశాంతతతో, ప్రేమతో విడిచిపెట్టేస్తున్నాను

ఆన్‌లైన్ బుల్లీయింగ్, వేధింపులు భరించలేక నేను చెన్నై నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నా కెరీర్ అయిన సంగీతాన్ని, థెరపీని కూడా పక్కన పెడుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు అన్ని సామాజిక మాధ్యమాల ఖాతాలను లాగౌట్ అందించింది. “ఫెమినిజం.. నువ్వు గెలిచావు, సంతోషం. నువ్వు ఓడిపోయావు” అంటూ కాస్త ఘాటుగా ఆమె తన పోస్ట్‌ని ముగించింది.

2,801 Views

You may also like

Leave a Comment