VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట
ఒంటిమిట్ట, మే 26:
టీడీపీ నాయకుడు నల్లగొండ హరినాథ్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్‌ను టీడీపీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి జగన్మోహన్ రాజు, ఇతర నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రాజు, గజ్జల నరసింహారెడ్డి, జెడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, బొబ్బిలి రాయుడు, బుజ్జీ ఈశ్వరయ్య, ఆలూరు వెంకటసుబ్బయ్య, భాషా సుబ్బరాయుడు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
హరినాథ్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

