- ఖమ్మం ప్రతినిధి చిన్నంశెట్టి రాంబాబు
ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర*
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఈద్ అల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.* త్యాగనికి , దైవభక్తికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ సోదర భావంతో శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని కోరారు , అంతేకాకుండా ప్రేమ, దయ, సహనం అనే మహత్తర విలువలను గుర్తు చేసే ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, ఐక్యతను నింపాలని ఆకాంక్షించారు. ఆ అల్లాహ్ కరుణాకటాక్షాలు, మనందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యలు ప్రసాదించాలని, అలాగే సంతోషం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.

