VRM మీడియా అయినవిల్లి భద్రం
ఉదయం నుండే మొదలైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం..
కోరుకొండ మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ..
అప్లై చేసుకున్న కొద్ది రోజుల్లోనే కొత్త పెన్షన్లు అందిస్తున్నాం… ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ..
👉👉 రాజానగరం నియోజకవర్గంలో పలువురు లబ్దిదారులకు పేదలకు సేవలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన పలువురికి స్వయంగా పింఛన్ అందజేసి, ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా మీకు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ .
👉👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహిస్తుందని..భర్త చనిపోతే వెంటనే భార్యకు పెన్షన్ అందించేలా చర్యలు చేపట్టిందని.. గతంలో 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారని కానీ ఇప్పుడు కొత్తగా పెన్షన్ మంజూరు విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చి లబ్దిదారులకు పెన్షన్ అందేలా చేస్తున్నామని.. గఅంకితభావం, నిబద్ధత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సొంతమని పేర్కొన్నారు.
👉 ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, పాల్గొన్నారు.
