సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ జూన్ 1
రాజంపేట టీడీపీ ఇన్చార్జ్ జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు సిద్ధవటం మండలం టక్కోలి హరిజనవాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసి మరింత మంది లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
