సిద్ధవటం, VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూన్ 4
రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఉంటుందని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతి కారి కృష్ణ తెలిపారు గడికోట గ్రామంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఆయన గురువారం అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా పార్లమెంటు సమన్వయకర్త అతి కారి కృష్ణ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో రాక్షసుడు పాలన కొనసాగి గ్రామ గ్రామాన కులాల వారీగా చిచ్చు పెట్టి పబ్బం గడుపుకున్న గొడ్డలి పార్టీని రాష్ట్రంలో బిజెపి టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడి రాక్షసుడు పాలనను అంతం చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గమనిస్తున్నారని జనసేన పార్టీ లో జన సైనికులు వీర మహిళలు ఒక క్రమశిక్షణతో పార్టీ సిద్ధాంత లకు కట్టుబడి ఉన్నారని డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని తెలిపారు రేణుక ఎల్లమాంబ అమ్మవారు ఆశీస్సులు రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వానికి ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్ జనసేన పార్టీ నేతలు అతి కారి చిన్న వెంకటయ్య, పసుపులేటి గంగయ్య విజయ్ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

