Home ఎంటర్‌టెయిన్మెంట్ యూట్యూబ్ స్టార్ రమా నందన కుటుంబంపై ఎఫ్ఐఆర్.. అసలు ఏం జరిగిందంటే? – VRM MEDIA

యూట్యూబ్ స్టార్ రమా నందన కుటుంబంపై ఎఫ్ఐఆర్.. అసలు ఏం జరిగిందంటే? – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీలు ఒక్కోసారి అనూహ్య వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా ‘నందుస్ వరల్డ్’ (నందుస్ వరల్డ్) ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ రామ నందన కుటుంబం ఇలాంటి తీవ్రమైన లీగల్ ఇష్యూలో ఇరుక్కుంది. యూకే వీసా రెన్యూవల్ చేయిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో రామ నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అలాగే ఆయన తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరు ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ ద్వారా ఈ మోసం జరిగినట్లు తెలుస్తోంది.

బాధితుడి యూకే వీసా గడువు ముగిసిపోత, దానిని సులభంగా రెన్యూవల్ చేయవచ్చని నమ్మించి నందు ఫ్యామిలీ ఏకంగా రూ. 15 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే నెలలు గడుస్తున్నా పని పూర్తి కాకపోగా, ఇచ్చిన డబ్బును కూడా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తమకున్న యూట్యూబ్ పాపులారిటీని చూస్తే నమ్మి డబ్బులు ఇచ్చానని ఆయన వాపోతున్నాడు.

ఒకప్పటి నటి అయిన రామ నందన, ఆ తర్వాత సోషల్ మీడియా వైపు అడుగులు వేసి తన ఫ్యామిలీ వ్లాగ్స్, రీల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఈమెకు భారీగా ఫాలోయింగ్ ఉంది. ఈ పాపులరిటీ వల్లే వీరికి కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి.

ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్‌తో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన చర్చకు దారితీసింది. ఇంకా, యూకే ఉద్యోగాలు, వీసాల పేరుతో మరికొందరి దగ్గర కూడా వీరు రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేశారంటూ కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై నందు ఫ్యామిలీ నటులు, తమపై కావాలనే కొందరు దుష్ప్రచారం ఖండిస్తున్నట్లు సమాచారం.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు సెక్షన్ 515/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఈ యూట్యూబ్ స్టార్ జంట ఈ లీగల్ ఇష్యూ నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.

2,801 Views

You may also like

Leave a Comment