సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూన్ 5
పొన్నవోలు కొత్తపల్లి కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ం పరిధిలోని సిద్ధవటం గ్రామం నందు వైద్యాధికారి సి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారు మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనరసమ గారి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు మరియు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగినది సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శుక్రవారం నాడు మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి లోపల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ ఇండ్లలోని నీటినంత పారబోసి డ్రమ్ములు కూలర్లు పూల కుండీలు లాంటి వాటిలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని వీటిలోని నీటిని పారబోసి కొద్దిసేపు ఆరబెట్టి తరువాత నీరు పట్టుకోవడం వల్ల ఈ దోమలు అభివృద్ధి చెందకుండా ఉంటాయ ని చెప్పడం జరిగింది అలాగే జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు మన సిద్ధవటం మండలంలో ఐదు సచివాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ కాటు వలన వస్తుందని ఈ దోమలు మురికి నీటిలో అభివృద్ధి చెందుతాయని ఈ మలేరియా దోమ కుట్టడం వలన విపరీతమైన చలి ఒళ్ళు నొప్పులు విపరీతమైన జ్వరము కంటి నుండి నీరు కారటము ఇలాంటి లక్షణాలు కనబడిన వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు వైద్యం తీసుకుంటే ఈ మలేరియా నయమవుతుందని దీనిని ఈ మలేరియాను అలసత్వం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే సమస్య వస్తుందని చెప్పడం జరిగినది ఈ మలేరియా 2030 నాటికి మన దేశం నుండి తరిమికొట్టే విధంగా మీరందరూ మీ ఇంటి చుట్టూ మీ గ్రామం చుట్టూ అపరిశుభ్ర వాతావరణం లేకుండా అలాగే పరిసరాల పరిశుభ్రత శారీరక శుభ్రత పాటించడం వలన ఈ అనేక రకములైన దోమలు మనకు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి జబ్బుల బారిన పడకుండా ఉంటామని ఈ జబ్బులన్నీ రాకుండా మనమంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రాత్రిపూట దోమతెరలో పడుకోవడం చేతికి నిండు దుస్తువులు వేసుకోవడం రాత్రిపూట వేపాకు పొగ వేసుకోవడం మన ఇంటి లోపల ఇంటి బయట చుట్టూ పరిసరాల ను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి జ్వరాలను మన రాష్ట్రం నుండి మన దేశం నుండి తరిమి కొట్టవచ్చునని చెప్పడం జరిగినది ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ మౌలాలి, శారదా దేవి ఎంఎల్ హెచ్పి లోకేశ్వరి ఆరోగ్య కార్యకర్తలు అంజనాదేవి శారద హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య ఆశ కార్యకర్తలు ఓబులమ్మ పద్మావతి కళావతి విజయభారతి పాల్గొనడం జరిగింది

