Home ట్రెండింగ్ తెలంగాణలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ | కొమురవెల్లి పుణ్యకేష్త్ర రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కానుండగా తెలంగాణ ఆలయ తీర్థయాత్ర ఊపందుకుంది. – VRM MEDIA

తెలంగాణలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ | కొమురవెల్లి పుణ్యకేష్త్ర రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కానుండగా తెలంగాణ ఆలయ తీర్థయాత్ర ఊపందుకుంది. – VRM MEDIA

by VRM Media
0 comments
తెలంగాణలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ | కొమురవెల్లి పుణ్యకేష్త్ర రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కానుండగా తెలంగాణ ఆలయ తీర్థయాత్ర ఊపందుకుంది.


తెలంగాణ

ఓయ్-చంద్రశేఖర్ రావు

కొమురవెల్లి పుణ్యకేష్ట్ర రైల్వే స్టేషన్: తెలంగాణలో మరో రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా పునర్నిర్మితమైంది. దీని నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయి కూడా. త్వరలో ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. ఇక్కడి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లికి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు ఉన్నాయి.

కొమురవెల్లి మల్లన్న స్వామి భక్తులకు శుభవార్త అందించింది దక్షిణ మధ్య రైల్వే. సిద్ధిపేట ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. దీని కోసం కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ సిద్ధమవుతోంది. భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుండి స్టేషన్. రాకపోకలకు ఇది మంచి కనెక్టివిటీని అందిస్తుంది. భక్తులు ఇకపై రైలులో ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

కొమురవెల్లి పుణ్యకేష్త్ర రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కానుండగా తెలంగాణ ఆలయ తీర్థయాత్ర ఊపందుకుంది.

ఈ రైల్వే స్టేషన్ లాకుదారం- దుద్దెడ మధ్య నిర్మించారు. ఈ ప్రాజెక్టును 2024 సంవత్సరంలో అందించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి నిధులను కేటాయించింది. ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన 2024 ఫిబ్రవరిలో జరిగింది. ఈ ముఖ్యమైన ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 5.63 కోట్లు కేటాయించింది. పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తయ్యాయి. రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది.

పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. భవనం, భవనం, ప్యాసింజర్ ప్లాట్ ఫాం, అయిదు ప్లాట్ ఫాం స్టేషన్లు, వెయిటింగ్ హాల్, సీటింగ్ అరెంజ్మెంట్, బుకింగ్ కౌంటరర్లు, సర్కులేటింగ్ ఏరియా, పార్కింగ్, ప్లాట్ ఫామ్ ల వద్ద మంచినీటి వసతి, అప్రోచ్ రోడ్లు, దివ్యాంగులకు అనుకూలంగా టాయ్ లెట్ల వంటి నిర్మాణాలు పూర్తయ్యాయి.

రైళ్ల ద్వారా కొమురవెల్లి మల్లన్నస్వామిని దర్శించుకోవడానికి నేరుగా భక్తులు ఈ స్టేషన్‌కు చేరుకోవచ్చు. రీజినల్ రైలు కనెక్టివిటీ ఎంతగానో మెరుగుపడుతుంది. లోకల్ టూరిజం పెరుగుతుంది. రాజీవ్ రహదారితో ఈ స్టేషన్ ను అనుసంధానించారు. ఫలితంగా నిరాటంక ప్రయాణానికి వెసలుబాటు కలుగుతుంది.

2,801 Views

You may also like

Leave a Comment