
.webp)
సమంత(సమంత) యాక్టింగ్ కి ఉన్న క్యాపబిలిటీ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. రెండు దశాబ్దాల నుంచి సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది. ఒంటి చేత్తో కూడా మూవీని నడిపించగల శక్తి తన సొంతం. ఇప్పుడు మళ్ళీ ఒంటి చేత్తో సినిమా హిట్ అవ్వడానికి జూన్ 19 న ‘మా ఇంటి బంగారం’తో అభిమానులు, ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిత్ర యూనిట్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది .
ఈ సందర్భంగా స్టేజ్ పై మా ఇంటి బంగారం ట్రైలర్ ని ప్రదర్శించారు. ఆ ట్రైలర్ లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఒకప్పటి హిట్ మూవీ ‘మంగమ్మ గారి మనవడు’లోని దంచవే మేనత్త కూతురువే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే సమంత ఒక రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు బాలయ్య అభిమానులను అలరిస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత, ఆమె భర్త రాజ్ మా ఇంటి బంగారాన్ని సృష్టించారు.
ఇది కూడా చదవండి: శ్రీముఖి పెళ్లి డేట్ ఇదే.. వరుడు ఎవరో తెలుసా!
.webp)