

స్టార్ హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకున్న భామ సమంత. ఈ నెల 19 న మరో సారి సెల్యులాయిడ్ పై తన సత్తా చాటడానికి రెడీ అవుతుంది. ప్రచార చిత్రాలైతే ఒక రేంజ్ లో ఉండటంతో పాటు ఆడవాళ్లు ఎందుకు తక్కువ కాదని చాలా బలంగా చెప్తారు. చిత్ర బృందం రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరు పాల్గొని చిత్ర బృందానికి అభినందలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ మా ఇంటి బంగారంతో ఒక్కకొకర్ని కొట్టబోతున్నాం. ప్రేమగానే కొట్టబోతున్నాం లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి చాలా స్ట్రెస్ అనుభవిస్తున్నాను. కానీ మూవీ బాగా రావడంతో చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా క్రెడిట్ ప్రతి ఒక్క నటులకి, టెక్నీషియన్స్ కి దక్కుతుంది. రాజ్ అండ్ డి కె ఎక్కువగా మాట్లాడరు. కానీ పని చేస్తూనే ఉంటారు. సినిమా రిలీజయ్యి విజయం సాధించాక మరింతగా మాట్లాడతాను అని సమంత చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: పోనీ వర్మ: ప్రకాష్ రాజ్ వైఫ్ పోనీ వర్మ సంచలనం.. విషాద సంఘటనా పట్టించుకోలేదు