తేది:16-06-2026, మంగళవారం
VRM మీడియా అయినవిల్లి భద్రం
విజయోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
👉రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
కూటమి ప్రభుత్వం నిర్వహించే విజయోత్సవ సభను శ్రేణులు విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరంలో మంగళవారం ఆమె మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్ సౌజన్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె దివి;18-06-2026 గురువారం నాడు రంప చోడవరం ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే సభా స్థలిని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని పార్టీ శ్రేణులు పక్కగా విజయవంతం చేయాలని సూచించారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. అన్ని వసతులు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఇది మన బాధ్యతగా సమష్టిగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, AMC వైస్ చైర్మన్ సలాది బాపిరాజు, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా చెల్లన్నదొర అనే బాబీ, సీతపల్లి దేవస్థానం గడి బాపనమ్మ తల్లి దేవస్థానం సభ్యులు సిద్ధా వెంకన్నదొర, జనసేన ప్రతినిధులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, పాపోలు శ్రీనివాసరావు, పతివాడ రమణ,అన్నిక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
