Home ట్రెండింగ్ సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్ .. ఆ డీఎంకే మంత్రి జైలుకు..?? | సీఎంవిజయ్ అవినీతిపై కఠిన చర్యలు: డీఎంకే మాజీ మంత్రి ఈవీ వేలు సీఎం విజయ్‌పై కేసులు నమోదు – VRM MEDIA

సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్ .. ఆ డీఎంకే మంత్రి జైలుకు..?? | సీఎంవిజయ్ అవినీతిపై కఠిన చర్యలు: డీఎంకే మాజీ మంత్రి ఈవీ వేలు సీఎం విజయ్‌పై కేసులు నమోదు – VRM MEDIA

by VRM Media
0 comments
సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్ .. ఆ డీఎంకే మంత్రి జైలుకు..?? | సీఎంవిజయ్ అవినీతిపై కఠిన చర్యలు: డీఎంకే మాజీ మంత్రి ఈవీ వేలు సీఎం విజయ్‌పై కేసులు నమోదు


భారతదేశం

-బొమ్మ శివకుమార్

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరి 50 రోజులు పూర్తి కావస్తున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ పార్టీపెట్టిన తొలిసారే ఏకంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ముందుకు సాగుతోంది. తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. తమిళనాడులో తాజాగా టీవీకే ప్రభుత్వం తొలిసారిగా అవినీతి నిరోధక చర్యకు పూనుకుంది. డీఎంకే సీనియర్ నేత, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి ఈ.వీ. వేలును లక్ష్యంగా చేసుకుని డీవీఏసీ ఏకకాలంలో విస్తృత శోధనలు నిర్వహించారు. ఇది కేవలం సాధారణ తనిఖీ కాదని, కొత్త ప్రభుత్వం తన రాజకీయ సత్తాను నిరూపించుకునే వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు అవినీతిని సహించేది లేదని ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సవాలుకు తగ్గట్టుగానే తాజా దాడులు జరిగాయి. మాజీ మంత్రి వేలుతో సహా సెంథిల్ బాలాజీ వ్యక్తిగత సహాయకుడు శంకర్ నివాసాల్లో, ఇటీవల శాఖకు చెందిన పలువురు అధికారులు, కాంట్రాల ఇళ్లలోనూ డీవీఏసీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

అరప్పోర్ ఇయక్కం ఫిర్యాదుతో కేసు

అవినీతి వ్యతిరేక సంస్థ ‘అరప్పోర్ ఇయక్కం’ ప్రతినిధి జయరామ్ వెంకటేశన్ 2022లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డీవీఏసీ కేసు నమోదు చేసింది. అభివృద్ధి కార్యక్రమం (CRIDP) కింద కేటాయించిన నిధులను దారి మళ్లించారని అందులో కేటాయించారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, ఆ తర్వాత హడావుడిగా పనులు పూర్తి చేశారనేది ప్రధాన ఆరోపణ.

కరూర్ ప్రాంతంలో రూ. 7 కోట్ల రహదారి పనుల ఒప్పందం జరిగిన కొద్ది రోజులకే రూ. 3.23 కోట్ల నిధులను విడుదల చేశారు. అలాగే నాబార్డ్ నిధులతో చేపట్టాల్సిన రహదారి పనులు అసలు ప్రారంభం కాకపోయినా రూ. 1.5 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీనితో నేరపూరిత కుట్ర, నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ ఆరోపణలపై మాజీ మంత్రిపై కేసు నమోదైంది.

ఈ దాడుల డీవీఏసీ నేతృత్వం వెనుక కనిపిస్తున్న ఏడీజీపీ. అరుణ్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. గతంలో డీఎంకేకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన అధికారి ద్వారా విజయ్ ప్రభుత్వం ఈ శోధనలు జరిపింది. దీనివల్ల ప్రతిపక్షాలు ఈ కేసును కేవలం రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించే అవకాశాలు తగ్గిపోయాయి. అత్యంత ప్రతిష్టాత్మక అధికారి ద్వారా ఈ శోధనలు సాగడం ప్రభుత్వానికి నైతిక బలాన్ని అందించింది.

డీఎంకే మాజీ మంత్రి ఈవీ వేలుపై నమోదైన అవినీతి కేసులపై సీఎం విజయ్‌ గట్టి చర్యలు తీసుకున్నారు.

ఈ దాడులు తమిళనాడు రాజకీయ సంప్రదాయాల్లో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాయి. గతంలో పాలకుల అవినీతిపై ఎలాంటి చర్యలు ఉండవనే ప్రచారాన్ని రూపుమాపుతూ సీఎం విజయ్ ముందడుగు వేశారు. ఈ నిర్ణయం ఆయనకు రాజకీయ మైలేజీతో పాటు పాలనా పారదర్శకతను చాటిచెప్పడమే కాక, భవిష్యత్తులో దర్యాప్తు సంస్థలు తన సొంత ప్రభుత్వంపై కూడా అదే తరహా నిఘా నిర్దేశించుకునే వేదికను సిద్ధం చేసింది.

2,801 Views

You may also like

Leave a Comment