Home ఎంటర్‌టెయిన్మెంట్ మమిత భైజు దెబ్బకి పూజాహెగ్డే విలవిల – VRM MEDIA

మమిత భైజు దెబ్బకి పూజాహెగ్డే విలవిల – VRM MEDIA

by VRM Media
0 comments
మమిత భైజు దెబ్బకి పూజాహెగ్డే విలవిల



– కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
– పూజాహెగ్డే కి షాక్
– ధనుష్ మూవీలో మమిత భైజు
– డ్యూడ్ తో మరోసారి ఆకట్టుకున్న మమిత భైజు

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ అని లెజండ్రీ లిరిక్ రైటర్ ‘సముద్రాల సీనియర్’ ఏ ముహూర్తాన చెప్పారో కానీ, ప్రతి రంగంలోనూ ఈ సాంగ్ ని తలుచుకొని వారం రోజులు ఉండరు. సినిమా రంగంలో అయితే కొంచం ఎక్కువగానే తలచుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినీ రంగంలో ఎవరి అవకాశాలని ఎప్పుడు ఎగరేసుకుపోతారో తెలియదు. అందుకే నటినటులతో పాటు 24 క్రాఫ్ట్స్ కి చెందిన వాళ్ళందరి నోళ్ళల్లో ఆ సాంగ్ రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సాంగ్ ప్రముఖ హీరోయిన్ ‘పూజాహెగ్డే’ పాడుకోవాల్సిన పరిస్థితి.

స్టార్ హీరో ధనుష్ ‘పోర్ తోజిల్’ ఫేమ్ ‘విగ్నేష్ రాజా’ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ధనుష్ నుంచి వస్తున్న 54వ మూవీ. ఇందులో మొదట పూజాహెగ్డే ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మమిత భైజు చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూజకి చాలా కాలం నుంచి సినిమాలు లేవు. ఈ ఏడాది మే లో సూర్యతో కలిసి చేసిన ‘రెట్రో’ పరాజయం చెందింది. దీంతో ధనుష్ మూవీ తన కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇస్తుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అలాంటిది ఈ మూవీ నుంచి తప్పించడం పూజ కి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పూజా లిస్ట్ లో ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయకన్ ఉంది. ఈ చిత్రంలో మమిత బైజు కూడా కీలక పాత్ర పోషించడం విశేషం.

అస్లో చదివాడు: చిరంజీవి మూవీలో కార్తీ! ప్లాన్ అదిరింది బాసు!
ఇక మమిత భైజు ‘ప్రేమలు’ తో పాన్ ఇండియా ప్రేక్షకులని తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది. రీసెంట్ గా డ్యూడ్ విజయంలో భాగస్వామ్యమవ్వడమే కాకుండా, తాను ఎంత వాల్యుబుల్ నటినో మరోసారి చెప్పింది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ప్రదర్శననుండగా మమిత బైజు ట్రెడిషినల్ విలేజ్ గర్ల్ క్యారక్టర్ లో కనిపించనున్నట్టు సమాచారం.

2,804 Views

You may also like

Leave a Comment