
ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 4:–
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పెద్దాపురంలో జరిగిన అండర్–17 విభాగం మండల స్థాయి క్రీడా పోటీల్లో మినర్వా స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభను ప్రదర్శించిన కబడ్డీలో రాజేష్, షాట్‌పుట్‌లో అవినాష్,షాట్‌పుట్ లో సుషిత అగ్రస్థానం సాధించి రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా పి.ఇ.టి. రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ “మా విద్యార్థులు క్రీడల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో శిక్షణ పొంది ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణం. రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తారని నమ్మకం ఉంది” అని అన్నారు.మినర్వా చైర్మన్ ముత్యాల మురళీకృష్ణ, హెచ్.ఎం. మహేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మణ్‌కుమార్ విద్యార్థులను అభినందిస్తూ “పాఠశాల విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపుతున్న మా విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రం, దేశానికి పేరు తీసుకువస్తారని విశ్వాసం ఉంది” అని తెలిపారు.