


సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 24
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన “రైతన్న మీకోసం” కార్యక్రమం రైతులకు మార్గదర్శకంగా, సాంకేతిక సహకారంగా నిలుస్తోంది. రైతుల పంట వివరాలు, సమస్యలు, ప్రభుత్వ పథకాల లబ్ధులను గ్రామస్థాయిలోనే అందించేందుకు ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ కార్యక్రమం లో భాగంగా టక్కోలు గ్రామం కాజీపల్లి లో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు తాజా ప్రభుత్వ పథకాలు, సాగు విధానాలు, పంట సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా మండలం స్పెషల్ ఆఫీసర్ శ్రీ జయసింహా అగ్రికల్చర్ మండల అధికారి శ్రీ రమేష్ రెడ్డి గారు పార్లిమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి గారు, జగన్ మోహన్ రెడ్డి గారు, పెంచల్ రెడ్డి గారుమరియు రైతులు పాల్గొన్నారు
పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు మాట్లాడుతూ “రైతన్న మీకోసం” కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రైతుల పక్షాన తీసుకుంటున్న పలు సంక్షేమ చర్యలను వివరించారు.