వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన ప్రభావం బంగారం, వెండి ధరలపై తీవ్రంగా పడింది. వీటి రేట్లల్లో నేడు పెరుగుదల కనిపించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం భయాలు, ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల అంతర్జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశాయి. ఈ అనిశ్చితి మధ్య మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 0.10 శాతం పెరిగి 10 గ్రామాలకు రూ. 1,54,963కి చేరుకుంది. వెండి కూడా లాభ పడింది. 0.48 శాతం లాభపడి కిలోకు రూ. 2,53,966గా నమోదైంది.
దేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరల వివరాలు చూస్తే ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్లు రూ. 1,54,090, 22 క్యారెట్లు రూ. 1,41,260లకు లభిస్తోంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్లు రూ. 1,53,990, 22 క్యారెట్లు రూ. 1,41,160 పలుకుతోంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 24 క్యారెట్లు రూ. 1,53,940, 22 క్యారెట్లు రూ. 1,41,110 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామాలు ఈ వారం మొత్తం కూడా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,622, 22 క్యారెట్లు – రూ. 14,320, 18 క్యారెట్లు – రూ. 11,940
ముంబై..
24 క్యారెట్లు – రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు – రూ. 11,651
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు – రూ. 11,651
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు – రూ. 11,651
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు – రూ. 11,651
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు – రూ. 11,651