Home Uncategorized భూలోకమ్మ అమ్మవారి ఆలయానికి కంబాల లక్ష రూపాయలు విరాళం

భూలోకమ్మ అమ్మవారి ఆలయానికి కంబాల లక్ష రూపాయలు విరాళం

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం

  • తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెం వద్ద ఉన్న శ్రీ భూలోకమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు
  • లక్ష రూపాయలు విరాళం శనివారం కోరుకొండలోని రామసేన కార్యాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
  • గతంలో అలయం చుట్టు ప్రహరీ నిర్మాణానికి సహాయం అందించాలని, కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావు గారిని కోరారు. అప్పుడు ఆలయ అభివృద్ధి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.
  • శనివారం లక్ష రూపాయలు నగదును కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందించారు.
  • ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
2,806 Views

You may also like

Leave a Comment