సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూన్ 12
శ్రేణులు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి శ్రీ నారా లోకేష్ మార్గదర్శకత్వంలో, రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో సిద్ధవటం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున “చలో తిరుపతి” కార్యక్రమానికి బయలుదేరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు తరలివెళ్లారు.ఈ సందర్భంగా పార్లిమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేయడం కూటమి ప్రభుత్వ విజయాలలో ముఖ్యమైనవని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి, మండల అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, రాజా నాయుడు, చెంచయ్య నాయుడు, నగేష్ నాయుడు, శ్రీను, x సర్పంచ్ ఓబులయ్య,సుబ్బా రెడ్డి, మచుపల్లి సుబ్బా రెడ్డి, నాగభూషణం నాయుడు వెంకట సుబ్బయ్య, శంకర్ శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు

